అల్ ఖోర్, అల్ షమాల్‌లోని ఔట్‌లెట్స్‌పై దాడులు
- January 03, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ మరియు కమూర్స్‌కి చెందిన ఇన్‌స్పెక్టర్స్, అల్ ఖోర్ మరియు అల్ షమాల్ ప్రాంతాల్లోని దాడులు నిర్వహించి, కన్స్యూమర్ రైట్స్ చట్ట నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. షాపులు మరియు ఫుడ్ ఔట్ లెట్స్, కమర్షియల్ యాక్టివిటీ సెంటర్స్‌పై జరిగిన దాడుల్లో 42 ఉల్లంఘనల్ని అధికారులు గుర్తించారు. అల్ ఖోర్ సిటీలో 32, అల్ షమ్మాల్ సిటీలో 10 నిబంధనల ఉల్లంఘన జరిగాయి. ఫిష్ ఔట్‌లెట్స్, ఫిషింగ్ ఇన్‌స్ట్రుమెంట్ షాప్స్, రెస్టారెంట్స్ మరియు కంప్యూటర్, ఎలక్ట్రిసిటీ ఎక్విప్‌మెంట్ దుకాణాలపై దాడులు జరిగాయి. ధరల పట్టీ లేకపోవడం, అధిక ధరలకి విక్రమిస్తుండడం, ధరల పట్టీపై అరబ్ లాంగ్వేజ్ లేకపోవడం, అమ్మకాలకు తగిన బిల్లుల్ని వినియోగదారులకు నఅందించకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. తాత్కాలిక మూసివేత, పూర్తిగా మూసివేత తదితర చర్యలు తీసుకోబడ్డాయనీ, 3 వేల ఖతారీ రియాల్స్ నుంచి 1 మిలియన్ ఖతారీ రియాల్స్ వరకు ఫైన్ విధించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







