గాయపడ్డ మహిళను ఎయిర్‌ లిఫ్ట్‌ చేసిన రాయల్‌ ఒమన్‌ పోలీస్‌

- June 13, 2019 , by Maagulf
గాయపడ్డ మహిళను ఎయిర్‌ లిఫ్ట్‌ చేసిన రాయల్‌ ఒమన్‌ పోలీస్‌

మస్కట్‌: మౌంటెయిన్స్‌పై ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడ్డ ఓ మహిళను రాయల్‌ ఒమన్‌ పోలీసులు ఎయిర్‌ లిఫ్ట్‌ చేసి, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విలాయత్‌ ఆఫ్‌ కురియాత్‌లో జరిగింది. గాయపడ్డ మహిళను అక్కడినుంచి ఖౌలా హాస్పిటల్‌కి పోలీస్‌ ఏవియేషన్‌ ద్వారా తరలించారు. గవర్నరేట్‌ ఆఫ్‌ మస్కట్‌ పరిధిలోని విలాయత్‌ ఖురియత్‌లో ఓ మహిళ మౌంటెయిన్స్‌పై ప్రమాదవశాత్తూ పడిపోవడం జరిగిందనీ, ఈ క్రమంలో ఆమెను తరలించేందుకు ఎయిర్‌ లిఫ్ట్‌ చేయాల్సి వచ్చిందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com