ఐస్‌ క్రీమ్‌ ఉచితంగా..

- June 13, 2019 , by Maagulf
ఐస్‌ క్రీమ్‌ ఉచితంగా..

కువైట్‌: కాద్సియా ప్రాతంలోని పాదచారులు, మోటరిస్టులకు వింత అనుభవం ఎదురయ్యింది. ఓ ఐస్‌ క్రీమ్‌ వెండర్‌, అటు వైపుగా వెళుతున్నవారిని ఆపి ఉచితంగా వారికి ఐస్‌క్రీమ్స్‌ అందించడమే దానికి కారణం. ఎందుకిలా చేస్తున్నారు? అనడిగితే, దానికి ఆ వెండర్‌ చెప్పిన సమాచారం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి, తన వద్దనున్న ఐస్‌క్రీమ్‌లన్నిటికీ ఖర్చయ్యే సొమ్ముని ఇచ్చారనీ, ఇటువైపుగా వచ్చేవారికి ఉచితంగా ఐస్‌క్రీమ్‌లు పంచమని చెప్పి వెళ్ళిపోయారని ఐస్‌ క్రీమ్‌ వెండర్‌ చెప్పారు. మండుతున్న ఎండల నేపథ్యంలో పాదచారులు, వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు ఆ వ్యక్తి ఈ గొప్ప పని చేసినట్లు తెలుస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com