సోమాలియా పై పంజా విసిరిన ఉగ్రవాదులు: 11 మంది మృతి
- June 16, 2019
వరుస బాంబు పేలుళ్లతో సోమాలియా దద్దరిల్లింది. సోమాలియా దేశ రాజధాని మొగదీషులోని అధ్యక్ష భవనంతోపాటు మరో చోట సంభవించిన కారుబాంబు పేలుళ్లలో 11 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయలయ్యాయి. మొదటి పేలుడు అధ్యక్ష భవనం సమీపంలోని తనిఖీ కేంద్రం దగ్గర జరిగిందని.. తొమ్మిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
రెండో పేలుడు ఘటన ఫోర్ట్‌ఫీల్డ్ విమానాశ్రయం సమీపంలోని తనిఖీ కేంద్రం దగ్గర సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరో వ్యక్తి దుర్మరణం చెందారు. బాంబు పేలుళ్లకు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థగా అల్ షబాబ్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
2017 అక్టోబర్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు అల్ షబాబ్ సంస్థే కారణం. ఆ ఘటనలో 500 మందికి పైగా మృతి చెందారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..