ఓపెన్‌ వర్క్‌ ప్లేసెస్‌లో సమ్మర్‌ వర్కింగ్‌ అవర్స్‌ ప్రకటన

- June 19, 2019 , by Maagulf
ఓపెన్‌ వర్క్‌ ప్లేసెస్‌లో సమ్మర్‌ వర్కింగ్‌ అవర్స్‌ ప్రకటన

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌, లేబర్‌ మరియు సోషల్‌ ఎఫైర్స్‌, ఓపెన్‌ వర్క్‌ ప్లేసెస్‌లో సమ్మర్‌ సందర్భంగా స్పెషల్‌ వర్కింగ్‌ అవర్స్‌ని ప్రకటించింది. ఆగస్ట్‌ 31 వరకు ఈ ప్రత్యేక పని గంటలు అమల్లో వుంటాయి. జూన్‌ 15 నుంచి ఆగస్ట్‌ 31 వరకు పని గంటలు అమల్లో వుంటాయనీ, ఉదయం 11.30 నిమిషాలకు పని ఆపేసి, తిరిగి మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే పని ప్రారంభించాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎంప్లాయర్స్‌ వర్కింగ్‌ అవర్స్‌ టైమ్‌ టేబుల్‌ని తయారు చేసుకుని, దాన్ని వర్క్‌ ఏరియాలో అందుబాటులో వుంచాలని అధికారులు సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీ హెచ్చరించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com