వరల్డ్‌లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా మోదీ..!

- June 21, 2019 , by Maagulf
వరల్డ్‌లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా మోదీ..!

భారత ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలిచారు.   బ్రిటీష్ హెరాల్డ్ సంస్థ నిర్వహించిన ఓటింగ్‌లో 2019లో  ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఓటేశారు.

లండన్‌కు చెందిన బ్రిటిష్ మేగజైన్ నిర్వహించిన ఈ రీడర్స్ పోల్ లో భారత ప్రధాని మోదీ 30.9శాతం ఓట్లతో గెలిచారు.  రష్యాకు చెందిన వ్లాదిమిర్ పుతిన్, డోనాల్డ్ ట్రంప్ (యుఎస్), చైనాకు చెందిన జి జిన్‌పింగ్ వరుసగా 29.9%, 21.9%, మరియు 18.1% ఓట్లు సాధించారు.

రీడర్స్ పోల్‌లో 25 మందికి పైగా ప్రపంచ నాయకులను నామినేట్ చేయగా, నలుగురు అభ్యర్థులను చివరి రౌండ్‌కు  నిపుణుల బృందం ఎంపిక చేసింది.
పోల్‌కు నామినేట్ అయిన వారందరిపై విస్తృతమైన అధ్యయనం తోపాటు పరిశోధనల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరిగింది.  సాధారణ ఓటింగ్ విధానంలా కాకుండా , బ్రిటిష్ హెరాల్డ్ పాఠకులు తమ ఓటును ధృవీకరించడానికి తప్పనిసరి వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ప్రక్రియ ద్వారా ఓటు వేసేలా పోల్ నిర్వహించింది.

నమో అని కూడా పిలువబడే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ అగ్రశ్రేణి నాయకులలో ఒకరిగా పరిగణించబడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనాకు చెందిన జి జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్‌లతో తన విజయవంతమైన అధికారిక విదేశీ పర్యటనలు మరియు సమావేశాల ద్వారా ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ నాయకుడిగా తన స్థాయిని పెంచుకున్నారు.

జూలైలో విడుదలకాబోయే బ్రిటిష్ హెరాల్డ్ మ్యాగజైన్ కవర్ పేజీలో పీఎం నరేంద్ర మోడీ  ఫొటో ప్రదర్శించ బడుతుందని ప్రకటించింది. ఇది 15 జూలై 2019 న విడుదల అవుతుంది.  బ్రిటిష్ హెరాల్డ్ మే-జూన్ సంచికలో జాకిందా ఆర్డెర్న్ మరియు మార్చి-ఏప్రిల్ సంచికలో వ్లాదిమిర్ పుతిన్ ఫొటోలను ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com