మరో అరుదైన ఘనత సాధించిన మోదీ
- June 22, 2019
ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత మేగజీన్ హెరాల్డ్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్‌లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ఎంపికయ్యారు మోదీ. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లను వెనక్కి నెట్టేసి జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో మోదీ టాప్ ప్లేస్‌లో నిలిస్తే…. ట్రంప్ ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అనూహ్యంగా రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ప్రపంచంలో అగ్ర రాజ్యంగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోక తప్పలేదు. టాప్ ప్లేస్ లో ఉన్న మోదీకి 30.9 శాతం మంది ఓటేయగా… రెండో స్థానం దక్కించుకున్న పుతిన్‌కు 29.9 శాతం ఓట్లు దక్కాయి. ఇక మూడో ప్లేస్ లో ఉన్న ట్రంప్ కు కేవలం 21.9 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. నాలుగో స్థానంలో ఉన్న జిన్ పింగ్‌కు 18.1 శాతం మంది ఓటేశారు.
జాబితాలో తన కంటే వెనుక స్థానాల్లో నిలిచిన ముగ్గురు దేశాధినేతలతో మోదీ భేటీలు, విదేశీ పర్యటనలు, ఆ పర్యటనల్లో సాధించిన ఫలితాలను బేరీజు వేసిన నెటిజన్లు… మోదీని వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ లీడర్‌గా ఎన్నుకున్నారని బ్రిటీష్ హెరాల్డ్ ప్రకటించింది. జూలై సంచిక మోదీ కవర్ పేజీతో విడుదల అవుతుందని హెరాల్డ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..