టెలికామ్ టవర్‌పై అస్వస్థతకు గురైన కార్మికుడ్ని రక్షించిన అధికారులు
- June 27, 2019
మస్కట్: టెలికమ్యూనికేషన్స్ వర్కర్ ఒకరు, కమ్యూనికేషన్ నెట్ వర్క్ టవర్‌పై అస్వస్థతకు గురవగా, అతన్ని అత్యంత చాకచక్యంగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) టీమ్ రక్షించింది. ముదైబిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిఎసిడిఎ వర్గాలు ఈ ఘటన గురించి వెల్లడిస్తూ కార్మికుడ్ని క్షేమంగా కిందికి దించామనీ, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పడం జరిగింది. అల్ షర్కియా గవర్నరేట్ పరిధికి చెందిన సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్ట్మెంట్ - రెస్క్యూ అలాగే అంబులెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పిఎసిడిఎ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. కార్మికుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే వుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..