పోలీస్‌పై దూషణలకు దిగిన కువైటీ మహిళ

- June 29, 2019 , by Maagulf
పోలీస్‌పై దూషణలకు దిగిన కువైటీ మహిళ

కువైట్‌: కువైటీ మహిళ ఒకరు, పోలీస్‌ అధికారులపై దూషణలకు దిగిన ఘటన కువైట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినందున ఓ మహిళను పోలీస్‌ అధికారి, ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కార్‌ రిజిస్ట్రేషన్‌ బుక్‌ని చూపించమని అడిగారు. అయితే, అందుకు ఆ మహిళ తిరస్కరించడమే కాకుండా, పోలీస్‌ అధికారిపై దూషణకు దిగి, ఆ తర్వాత వేగంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోయింది. ఈ ఘటనలో నిందితురాలు ఎవరన్నది స్పష్టంగా తెలియరాలేదు. నిందితురాలిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు. పోలీస్‌ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com