ఇరాన్ నిర్ణయంపై చైనా విచారం
- July 02, 2019
బీజింగ్: అణుఒప్పందంలో పొందుపర్చిన యురేనియం నిల్వల పరిమితిని దాటాలన్న ఇరాన్ నిర్ణయంపై చైనా విచారం వ్యక్తం చేసింది. అయితే ఈ ఉద్రిక్తతలన్నింటికీ మూలకారణం అమెరికా కొనసాగిస్తున్న అధికవత్తిడే నని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి గెంగ్‌షువావాంగ్ స్పష్టం చేశారు. అమెరికా కఠిన ఆంక్షల ప్రభావం నుండి తమ దేశాన్ని రక్షించేందుకు ఈ ఒప్పందంలో ఇతర భాగస్వాములైన బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాలు ముందుకు రాకపోతే తాము యురేనియం నిల్వల పరిమితిని అతిక్రమిస్తామని ఇరాన్ సోమవారం ప్రకటించింది. ఇరాన్ ప్రకటనపై స్పందించిన ట్రంప్ 'నిప్పుతో చెలగాటమాడుతోందం'టూ మండిపడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన చైనా విదేశాంగశాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం పట్ల చైనా విచారం వ్యక్తం చేస్తోందన్నారు. అయితే అదే సమయంలో ప్రస్తుత ఉద్రిక్తతలన్నింటికీ అమెరికా ఇరాన్‌పై కొనసాగిస్తున్న అత్యధికస్థాయి వత్తిడే ప్రధాన కారణమన్నది తమ నిశ్చితాభిప్రాయమని ఆయన చెప్పారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని అన్ని వర్గాలూ సంయమనంతో వ్యవహరించాలని, అణు ఒప్పంద స్ఫూర్తికి కట్టుబడి వ్యవహరించాలని తాము కోరుతున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







