విమానం నుండి క్రిందపడ్డ మృతదేహం...
- July 02, 2019
లండన్:ఎగురుతున్న విమానంలో నుండి మృతదేహం క్రిందపడింది.అదికూడ 3500 అడుగుల ఎత్తునుండి ప్రయాణిస్తున్న విమానం నుండి క్లాఫామ్ గార్డెన్‌లో సన్‌బాత్ చేస్తున్న వ్యక్తి ముందు పడింది.దీంతో సన్‌బాత్ చేస్తున్న వ్యక్తి భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా పరుగులు తీశాడు.
జూన్ 30న ఆదివారం ఆకాశం నుండి వెళుతున్న కెన్యా ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం KQ 100 నుండి అకస్మత్తుగా లండన్ వీధుల్లో పడింది.దీంతో ఒక్కసారిగా సౌత్ లండన్‌లోని ఓ గార్డెన్‌లో పడింది.అయితే గార్డెన్‌లో సన్‌బాత్ చేస్తున్న ఓ వ్యక్తికి కేవలం కొద్ది దూరంలో మృతదేహం పడింది.దీంతో ఒక్కసారిగా పరుగులు తీశాడు.అనంతరం మూడు వేల అడుగుల ఎత్తునుండి వెళ్తున్న విమానంలోని మృతదేహం క్రింద పడడంతో చుట్టుపక్కల జనం ఏంజరిగిందోనట్టు బయటకు వచ్చారు.వెంటనే స్థానిక లండన్ మెట్రోపాలిటన్ పోలీసులకు సమాచారం అందించారు.
కాగా కెన్యా ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం KQ 100 నైరోభి నుండి హీత్రో కు వెళుతుంది.సుమారు 4000 కి.మీ మేర ప్రయాణించనున్న విమానం ఎనిమిదిన్నర గంటల పాటు ప్రయాణిస్తుంది.అయితే విమానంలో ఉన్న లాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ నుండి ఫ్రీజ్ చేసిన మృతదేహం పడడంతో దీనిపై కెన్యా ఎయిర్‌పోర్టు అధికారులు విచారణ ప్రారంభించారు.విమానం విమానాశ్రయానికి వచ్చినప్పుడు ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో ఒక బ్యాగ్, నీరు మరియు కొంత ఆహారం కనుగొనబడినట్లు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.మృతిని వివరాలు కనుగొనేందుకు కెన్యా హై కమిషన్ తో సంప్రదింపులు జరుపుతున్నారు.జరిగిన సంఘటనపై విచారాన్ని వ్యక్తం చేశారు.

తాజా వార్తలు
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా







