బడ్జెట్లో ఏ.పి,తెలంగాణ రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే..!
- July 05, 2019
ఢిల్లీ:కేంద్ర బడ్జెట్ పై గంపెడాశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు దక్కింది అరకొరేనని తెలుగురాష్ట్రాలకు చెందిన నేతలు పెదవి విరుస్తున్నారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన నిర్మలా సీతారామన్... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలకు చేసిన కేటాయింపులను వివరించారు... ఏపీలోని సెంట్రల్ యూవర్సిటీకి రూ.13 కోట్లు, ట్రైబల్ యూనివర్సిటీకి రూ. 8 కోట్లు కేటాయించిన కేంద్రం... తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఇవి మినహా తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయించిందేమీ లేదు. ఏపీలోని ఐఐటీ, ఐఐఎం, నిట్, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీలకు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు నిల్ కాగా... ఎపి, తెలంగాణలోని మిగతా ప్రభుత్వ రంగ సంస్థలకు మొండి చెయ్యే చూపించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!