బికె బిర్లా మృతికి సంతాపం తెలిపిన బిర్లా పబ్లిక్‌ స్కూల్‌

- July 09, 2019 , by Maagulf
బికె బిర్లా మృతికి సంతాపం తెలిపిన బిర్లా పబ్లిక్‌ స్కూల్‌

దోహా: తమ ఫౌండర్‌ అలాగే ప్రముఖ ఫిలాంత్రపిస్ట్‌, ఇండస్ట్రియలిస్ట్‌ బికె బిర్లా మృతికి బిర్లా పబ్లిక్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌, స్టాఫ్‌ మరియు స్టూడెంట్స్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. బికె బిర్లా పలు పుస్తకాల్ని కూడా రచించారు. 'స్వాంతా సుఖాయ' అనే ఆటోబయోగ్రపీని కూడా రచించారాయన. ప్రీ ఇండిపెండెన్స్‌, మహాత్మా గాంధీతో తనకున్న అనుబంధం సహా అనేక విషయాల్ని అందులో ఆయన పొందుపరిచారు. బికె బిర్లా పలు ఛారిటీ ట్రస్టులకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ ట్రస్టుల ద్వారా ఎన్నో ఇంజనీరింగ్‌ కాలేజీలు, స్కూళ్ళు నడుస్తున్నాయి. దోహాలో 2004లో బికె బిర్లా, బిర్లా పబ్లిక్‌ స్కూల్‌ని ఏర్పాటు చేశారు. బిర్లా పబ్లిక్‌ స్కూల్‌ వైస్‌ ఛైర్మన్‌ గోపె సహాని, డైరెక్టర్‌ సివి రప్పాయ్‌, ప్రిన్సిపల్‌ ఎపి శర్మ తదితరులు బికె బిర్లా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com