తెలంగాణ,ఏ.పి రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు
- July 16, 2019
తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమికి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సద్గురు సాయిబాబా ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. సాయినామ స్మరణతో మార్మోగుతున్నాయి. సాయి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు.
హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పర్వదిన వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. విద్యుత్దీప కాంతులతో సాయి ఆలయం దేదీప్యమానంగా కాంతులీనుతోంది. బాబా ఆలయానికి చేరుకుంటున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అటు ఎల్బీనగర్, పంజాగుట్ట, కూకట్పల్లి సాయిబాబా ఆలయాల్లో గురుపూర్ణిమ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయిని దర్శించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు