వంట విషయమై తగాదా: రూమ్‌ మేట్‌పై దాడి

వంట విషయమై తగాదా: రూమ్‌ మేట్‌పై దాడి

ఆసియాకి చెందిన వలస కార్మికుడొకరు రస్‌ అల్‌ ఖైమా క్రిమినల్‌ కోర్టులో హాజరయ్యారు. రూమ్‌ మేట్‌తో వంట విషయమై తలెత్తిన గొడవ కారణంగా నిందితుడు, తన రూమ్‌మేట్‌పై కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ దాడి కారణంగా బాధిత రూమ్‌ మేట్‌ చెయ్యికి తీవ్ర గాయమై, శాశ్వత వైకల్యం సంభవించింది. సలోనా వంటకం విషయమై ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేయగా, తనను వంట విషయమై అవమానించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని విచారణలో నిందితుడు పేర్కొన్నాడు. అయితే బాధిత వ్యక్తి మాత్రం, తాను అవమానించలేదని పేర్కొన్నాడు. కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.  

Back to Top