హెల్త్‌ వయొలేషన్స్‌: బేకరీ మూసివేత

హెల్త్‌ వయొలేషన్స్‌: బేకరీ మూసివేత

మస్కట్‌: విలాయత్‌ బహ్లాలోని ఓ బేకరీ, హెల్త్‌ రిక్వైర్‌మెంట్స్‌ విషయంలో ఉల్లంఘనలకు పాల్పడిందంటూ ఆ బేకరీని మూసివేశారు మునిసిపాలిటీ ఆఫ్‌ అల్‌ దఖ్లియా అధికారులు. ఈ విషయాన్ని అల్‌ దఖ్లియా గవర్నరేట్‌ వెల్లడించింది. మునిసిపాలిటీస్‌ ఆఫ్‌ అల్‌ దఖ్లియా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఆ బేకరీలో హెల్త్‌ కండిషన్స్‌కి విరుద్ధంగా వున్న ఆహార పదార్థాల్ని ధ్వంసం చేసే దిశగా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఆకస్మిక తనిఖీల్లో మరికొన్ని బ్యాకరీలు కూడా వయోలేషన్స్‌కి పాల్పడినట్లు తేలిందని, ఉల్లంఘనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని మునిసిపాలిటీస్‌ ఆఫ్‌ అల్‌ దఖ్లియా వెల్లడించింది. 

Back to Top