అతి త్వరలో త్రీడీ ప్రింటెడ్ హౌస్
- July 18, 2019
దుబాయ్‌లో అతి త్వరలో త్రీడీ ప్రింటెడ్ హౌస్ అందరినీ ఆశ్చర్యపరచబోతోంది. దుబాయ్‌కి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎమార్, త్రీడీ మోడల్ హోమ్‌ని అరేబియన్ రాంచెస్ 3లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రాపర్టీ రంగంలో త్రీడీ ప్రింటెడ్ హౌస్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగా స్థానిక కాంట్రాక్టర్ ద్వారా ఈ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఈ త్రీడీ ప్రింటెడ్ మోడల్ హౌస్, నిర్మాణ రంగంలో ఓ అద్భుతం కాబోతోందనీ, ఇది మరింతమందికి కొత్త మార్గం చూపుతుందని అంచనా వేస్తున్నారు. దుబాయ్‌లో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీస్ పయనీర్‌గా వున్న తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పుడూ ముందుంటామనడానికి ఇదే నిదర్శనమని ఎమార్ ప్రాపర్టీస్ ఛైర్మన్ మొహమ్మద్ అలాబ్బర్ చెప్పారు. నిర్మాణ రంగంలో ఖర్చుని తగ్గించడం, వినియోగదారుల ఆలోచనలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టడం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో మరింత సులభతరం కానున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!