ఏపీ ప్రభుత్వానికి మరో షాక్..
- July 23, 2019
ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమంటూ ఏఐఐబీ తేల్చి చెప్పింది. అమరావతి అభివృద్ధికి రుణసాయం చేయలేమని ప్రపంచ బ్యాంక్ నిరాకరించిన వారం రోజులు గడవకముందే ఇప్పుడు మరో బ్యాంక్ వెనుకడుగు వేసింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమంటూ ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఓ న్యూస్ ఏజెన్సీకి పంపిన ఈ మెయిల్‌లో AIIB ప్రతినిధి ఈ విషయాన్ని తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ సుముఖత వ్యక్తం చేసింది. ప్రపంచ బ్యాంకు రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకున్న వారం రోజుల్లోనే ఏఐఐబీ కూడా రుణసాయంపై వెనక్కి తగ్గడం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







