ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ నివాస్ మిత్తల్ సోదరుడు అరెస్ట్
- July 24, 2019
బోస్నియా: ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ నివాస్ మిత్తల్ సోదరుడు ప్రమోద్ మిత్తల్‌ను ఆర్థిక నేరాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాల కింద ఐరోపాలోని బోస్నియా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆరోపణలు నిజమని తేలితే అక్కడి చట్టాల ప్రకారం దాదాపు 45సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బోస్నియాలో అత్యంత పెద్ద ఎగుమతిదారుగా ఉన్న జీఐకేఐఎల్ కంపెనీకి ప్రమోద్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రమోద్‌తో పాటు కంపెనీ జనరల్ మేనేజర్ పరమేశ్ భట్టాచార్య, బోర్డు సభ్యుడు రజీబ్ డాశ్ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి ఓ ఉన్నతాధికారి స్థానిక మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు ఆధారాలతో సహా వారిని బుధవారం కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!