బంగారం ధర మూడు వారాల గరిష్ఠానికి చేరింది..

- January 06, 2016 , by Maagulf
బంగారం ధర మూడు వారాల గరిష్ఠానికి చేరింది..

 బంగారం ధర మూడు వారాల గరిష్ఠానికి చేరింది. బుధవారం రూ.60 పెరగడంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,900కి చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,077.23 అమెరికన్‌ డాలర్లకు చేరింది. అలాగే ఈ రోజు వెండి ధర సైతం పెరిగింది. రూ.50 పెరగడంతో కేజీ వెండి ధర రూ.33,750కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com