తండ్రిని కరెంట్ షాక్‌తో చంపాడు!
- January 06, 2016
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని జువ్విపాడులో ఇటీవల జరిగిన హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్టుచేశారు. మంగళవారం డీఎస్పీ బీ రవీంద్రనాథ్ కేసు వివరాలను వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 20న జువ్విపాడులో నెల్లి వెంకట్రావు(60)ను ఆయన మూడవ కుమారుడు నెల్లి నాగేశ్వరరావు విద్యుత్ షాక్ ఇచ్చి హత్యచేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాననిందితుడైన నాగేశ్వరరావు రూ.2.5 లక్షలు ఖర్చుచేసి దుబాయి వెళ్లి వెంటనే తిరిగి రావడంతో డబ్బంతా ఖర్చుచేసి అప్పులు పాలు చేశావంటూ తండ్రి చేసిన వేధింపులు భరించలేకపోయాడు. తండ్రి పైనే కక్ష పెంచుకుని ఇంటి వద్ద నిద్రిస్తున్న సమయంలో డిసెంబర్ 20 తేదీ అర్ధరాత్రి కరెంటుషాక్ ఇచ్చి తండ్రిని హత్యచేశాడని ఆయన వెల్లడించారు. నాటినుంచి పరారీలో ఉన్న నిందితుడు నాగేశ్వరరావు కోసం సీఐ పీ కాశీవిశ్వనాథ్ బృందం గాలిస్తుండగా మంగళవారం మధ్యాహ్నం నిందితుడు వీఆర్వో పైడిమల్ల సత్తిబాబు వద్దకు వచ్చి లొంగిపోయినట్టు డీఎస్పీ రవీంధ్రనాథ్ తెలిపారు. నిందితుడిని అరెస్టుచేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







