పరిమితి కాలానికి ప్రత్యేక రాయితీను ప్రకటించిన ఎమరేట్స్
- January 06, 2016
ఒక పరిమిత సమయం వరకు ప్రయాణికుల , వ్యాపార , ఆర్ధిక తరగతి విమాన ప్రయాణానికి ప్రత్యేక రాయితీను ఎమరేట్స్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ విమాన టికెట్ బుకింగ్ జనవరి 18వ తేదీ వరకు ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 18వ తేదీ లోపు ప్రయాణించేవారికి ఈ బుకింగ్ వ్యవధి వర్తిస్తుంది. దుబాయ్ నుంచి మధ్య తూర్పు మరియు ఆసియా గమ్యస్థానాలకు 650 దినార్లతో ప్రయాణించవచ్చు. మస్కట్ నుంచి కరాచికు 935 దినార్లు , దుబాయ్ నుంచి ముంబైకు 1025 దినార్లు, దుబాయ్ నుంచి మనీలకు 2,205 దినార్లు, దుబాయ్ నుంచి కౌలాలంపూర్ కు 2,245 దినార్లు విమాన ప్రయణానికి ఖర్ఛు కానుంది. అలాగే, యూరోప్ దేశాలకు ప్రత్యేక రాయితీ ఈ విధంగా ఉంది .దుబాయ్ నుంచి మ్యూనిచ్ కు 2,625 దినార్లు, దుబాయ్ నుంచి బార్సిలోనా కు 2,815 దినార్లు , దుబాయ్ నుంచి పారిస్ కు 3,695 దినార్లు, దుబాయ్ నుంచి నార్త్ సెంట్రల్ అమేరికా నగరాలకు , లాస్ ఏంజెల్స్ కు 4,945 దినార్లు, పనామా నగరానికి 6,345 దినార్లుగా ఉందని ఎమరేట్స్ ఎగ్జీక్వుటేవ్ ఉప అధ్యక్షుడు తిఎర్రి అన్తినోరి తెలిపారు. 2016 లో జరిగే అన్ని ప్రయాణాలు ఈ ప్రత్యేక రాయితీ కాలంలో వేగం పునజుకొనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







