ఫీజ్ పెంచడంలేదన్న డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్
- January 06, 2016
ఇంధన ధరల్లో పెరుగుదల కారణంగా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు ఫీజు పెంచుతున్నారనే వార్తలు రాగా, ఆ వార్తల్లో నిజం లేదని డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు వెల్లడించారు. పెరుగుదల చాలా తక్కువగా ఉండటంతోనే ఫీజు పెంచడంలేదని ఓ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ చెప్పారు. అయితే భవిష్యత్తులో ఇంధన ధరలు ఇంకా పెరిగితే, అప్పుడు ఫీజు పెంచక తప్పదని ఆయన అన్నారు. ఇన్స్ట్రక్టర్స్ అందరం కలసి కట్టుగా ఫీజు పెంపకపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారాయన. గంట సమయానికి లెర్నర్స్ 6 నుంచి 8 ఒమన్ రియాల్స్ వరకూ చెల్లిస్తారనీ, ఛార్జీలు పెంచవలసి వస్తే దాన్ని 10 ఒమన్ రియాల్స్ చేయవలసి ఉంటుందన్న ఆయన, అలా పెంచడం ద్వారా ట్రైనీలపై భారం పెరుగుతుందనీ, తద్వారా లైసెన్స్ పొందడం భారమవుతుందని చెబుతూ పలు కారణాలతో ప్రస్తుతానికి ఫీజు పెంపకం ఆలోచనలకే పరిమితమయ్యిందని వివరించారు. ఇంధన ధరల పెంపుతో అన్ని విభాగాల్లోనూ ఛార్జీల మోత మోగనుంది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







