నేడు భారత దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల బంద్
- July 31, 2019భారత దేశవ్యాప్తంగా ఇవాళ ప్రైవేటు ఆసుపత్రులు బంద్ పాటిస్తున్నాయి. అత్యవసర సేవలు మినహా.. 24 గంటల పాటు ఇతర వైద్యసేవలు లభించవు. లోక్సభలో జాతీయ వైద్య కమిషన్ బిల్లును ఆమోదించినందుకు నిరనసగా.. 24 గంటల బంద్కు పిలుపునిచ్చింది భారతీయ వైద్యసంఘం. ఈ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. బంద్కు ఐఎంఏ తెలుగు రాష్ట్రాల కమిటీలు మద్దతు తెలిపాయి. జూనియర్ వైద్యులు సైతం మద్దతు తెలిపారు.
వైద్యసేవల నిలిపివేతతో రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్నామ్నాయ ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ వైద్యులందరూ ఇవాళ విధులకు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించాయి. పీజీ వైద్య విద్యార్థులు విధుల్లో లేని లోటు కనిపించకుండా 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకొచ్చే రోగులకు చికిత్స లభించక ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు