భారతీయ వస్త్ర కౌగిలిలో బ్రిటీష్ ప్రిన్స్
- August 01, 2019
రాజకుమారుడిని భారతీయ వస్త్రం తన కౌగిలిలో దాచుకుంది. బ్రిటీష్ రాచరిక కుటుంబానికి చెందిన మేఘన్ మెర్కెల్ లతన చిన్నారి ఆర్చీకి భారతీయ టవల్ కప్పింది. దీంతో భారత్‌పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్ పరిసర ప్రాంతాలలో తయారయ్యే వస్త్రాలను హాంకాంగ్‌కి చెందిన మలబార్ బేబీ బ్రాండ్ సంస్థ కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. దాదాపు యూరోపియన్ దేశాలన్నింటికి ఈ వస్త్రాలను ఎగుమతి చేస్తోంది ఆ సంస్థ. అయితే కొద్ది నెలల క్రితం విదేశీ జర్నలిస్టు ప్రతినిధుల బృందం జైపూర్ సమీపంలోని గ్రామంలో గల నయికా ‘ ఫ్యాక్టరీని సందర్శించింది.
ఆ బృందం అక్కడ తయారు చేసే శాలువాలు, టవల్స్ తదితర వస్త్రాలను పరిశీలించారు. అనంతరం వాటిని తయారుచేసే కార్మికుల కష్టాలు తెలుసుకున్నారు. నెలకు కేవలం 6 వేల జీతంపై తాము పనిచేస్తామని, కానీ తమ కష్టానికి ఇది ఏ మాత్రం చాలడంలేదు అంటూ అరుణ రెగర్ అనే కార్మికురాలు తమ బాధలను వారితో చెప్పుకున్నారు. విదేశాలలో ఆ వస్త్రాల డిమాండ్‌ను పాత్రికేయ బృందం ఆమెకు వివరించారు. అక్కడ వీటికి పలికే ధర తెలిసి ఆమె షాక్‌కి గురయింది. తాము కష్టపడి వీటిని తయారు చేస్తే వీటికి ఈ దేశంలో విలువ తక్కువని, కానీ బ్రిటన్ వంటి దేశాల్లో వీటి ధరలు ఇంతగా ఉంటాయని తాము భావించలేదని తెలిపింది. యూరప్‌లో వీటికి ఉన్న డిమాండ్ కారణంగా నయికా ఫ్యాక్టరీకి ఆర్డర్ల సంఖ్య పెరిగింది. దీంతో పరిశ్రమ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. మేఘన్ మెర్కెల్ తన కుమారుడి పైకప్పిన ఆ టవల్ పరిశ్రమలో పనిచేసే కార్మికుల వ్యధాభరిత జీవితాలను వెలుగులోకి తీసుకువచ్చేలా చేసింది. గంటకు వారి వేతనం 36 పైసలు మాత్రమే అని తెలిపే దీనమైన బతుకు చిత్రం విదేశీ మీడియాను సైతం ఆకర్షించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు







