ప్రవాసాంధ్రుల కోసం 'తానా' టోల్ ఫ్రీ సేవలు ప్రారంభం...
- August 03, 2019
అమెరికా:ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అంటే అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలలో అతి పెద్ద సంఘం అనే చెప్పాలి. తానా చేపట్టే సేవా కార్యక్రమాలు కేవలం అమెరికాలో ఉంటున్న ప్రవాసీయులకే మాత్రమే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో చేపడుతూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆపదలో ఉన్న వారి సమస్యలపై సత్వరమే స్పందించడంలో తానా ఎప్పుడూ ముందుంటుంది.
అయితే తమ సేవలని మరింతగా విసృతం చేయడానికి, ఆపద సమయంలో ఉన్న తెలుగు వారికోసం తానా మరొక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అదే తానా టోల్ ఫ్రీ నెంబర్. ఈ సేవలని తానా టీమ్ స్క్వేర్ ఆధ్వర్యంలో నిర్వహించేలా ప్రణాలికలు రూపొందించింది. ఈ సేవలని ప్రారంభించినట్టుగా టీమ్ స్క్వేర్ అధ్యక్షుడు కొల్లా అశోక్ బాబు తెలిపారు.
1855 OUR TANA అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమని సంప్రదించ వచ్చునని అశోక్ బాబు అన్నారు.అంతేకాదు ఈ సేవలని కేవలం తానా టీమ్ స్క్వేర్ మాత్రమే కాకుండా తానా అడ్హాక్ కమిటీల ద్వారా కూడా సేవా కార్యక్రమాలు చేపడుతామని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







