సంచలన నిర్ణయం: ఆర్టికల్ 370, 35-A రద్దు

- August 05, 2019 , by Maagulf
సంచలన నిర్ణయం: ఆర్టికల్ 370, 35-A రద్దు

 

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370, 35-A రద్దు చేసింది. ఈ మేరకు రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. ఆర్టికల్ 370 తొలగిస్తున్నామని, 35-A రద్దు చేస్తున్నామని సవరణ ప్రవేపెట్టారు అమిత్ షా. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఆయన ప్రతిపాదన ప్రవేశపెట్టారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. అమిత్ షా ప్రకటనను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.

సభ్యుల ప్రతిఘటన మధ్య ఆర్టికల్ 370 రద్దు బిల్లుని అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించారు. రాజ్యసభలో ప్రకటించడమే తరువాయి.. ఆర్టికల్ 370 రద్దుకి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి గెజిట్ కూడా విడుదల చేశారు. ఆ విధంగా ఆర్టికల్ 370 రద్దుని మోడీ ప్రభుత్వం క్షణాల్లో అమలు చేసేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com