జగన్ పర్యటనపై స్పందించిన ఇజ్రాయిల్
- August 06, 2019
దిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇజ్రాయిల్ పర్యటనపై ఆ దేశ రాయబారి ట్విటర్లో స్పందించారు. నీటి నిర్లవణీకరణపై ఏపీతో ఒప్పందం విజయవంతమైందని వెల్లడించారు. తమ సాంకేతికత ఏపీకి ఇతోధికంగా ఉపయోగపడుతుందని ట్విటర్లో పోస్టు చేశారు.
ఇజ్రాయిల్‌లో పర్యటించిన సీఎం జగన్ హడేరాలోని H2ID ఉప్పునీటి శుద్ది చేసే ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు ఉప్పు నీటిని తాగునీరుగా మార్చే మెకానిజం మరియు ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, వ్యయంపై ప్రదర్శన ఇచ్చారు. ప్రాజెక్టుకు ఏర్పాటుకు పెట్టిన ఖర్చు, కార్యాచరణ ఖర్చుల గురించి వివరించారు. ఉప్పు నీటి శుద్ధి చేసే విధానంలో పలు ప్రక్రియను గురించి ఇజ్రాయెల్ అధికారులు వివరించారు. అక్కడ శుద్ది చేసిన నీటిని ముఖ్యమంత్రి సహా అధికారులు రుచి చూశారు. దాని నాణ్యతను తెలుసుకుని ప్రశంసించారు. జగన్‌తో పాటు టెల్ అవీవ్‌లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇండియన్ మిషన్ షెరింగ్ కూడా ఉన్నారు. హడేరా ప్లాంట్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ రఫీ షమీర్ ఈ పర్యటనను నిర్వహించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!