ఖతారీ స్విమ్మర్కి గోల్డ్ మెడల్
- August 06, 2019ఖతార్: ఖతార్ యంగ్ స్పోర్టింగ్ స్టార్స్ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ప్రతిభను చాటి చెబుతున్నారు. తాజాగా ఖతారీ స్విమ్మర్ తమీమ్ మొహమ్మద్, 14వ అరబ్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. 50 మీటర్ల బటర్‌ఫ్లై పోటీల్లో ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు తమీమ్ మొహమ్మద్. ఆగస్ట్ 7 వరకు ఈ పోటీలు మొరాకోలోని రబాత్‌లో కొనసాగుతాయి. ఖతారీ స్విమ్మర్స్ అబ్దుల్అజీజ్ అలి ఒబైది, ఫరెస్ అల్ సైది, 2019 స్విమ్మింగ్ వరల్డ్ కప్‌లో తమ ప్రస్థానాన్ని ముగించారు. టోక్యోలో ఈ పోటీలు జరిగాయి. కాగా, చైనాలోని జినాన్‌లో జరిగే రెండో రౌండ్ టోర్నమెంట్లో ఖతార్‌కి చెందిన అమ్మార్ అష్రాఫ్, కరిమ్ సలామా పోటీ పడనున్నారు. ఆగస్ట్ 8, 10 తేదీల్లో ఈ పోటీలు జరుగుతాయి. యూకుబ్ అల్ ఖులైఫి, యూసఫ్ అల్ ఖులైఫి మూడో రౌండ్లో సింగపూర్‌లో 15 నుంచి 17 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు