ఈద్ అల్ అదా: దుబాయ్లో ఫ్రీ పార్కింగ్ ప్రకటన
- August 06, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో ఫ్రీ పార్కింగ్ని ప్రకకటించింది. మల్టీ లెవల్ పార్కింగ్ టెర్మినల్స్ మినహా అన్ని పార్కింగ్ జోన్స్ ఆగస్ట్ 10 నుంచి 13 వరకు ఉచితం. కాగా, ఈద్ అల్ అధా నేపథ్యంలో మెట్రో రైళ్ళ వేళల్లోనూ మార్పుల్ని చేర్పుల్ని ప్రకటించడం జరిగింది. దుబాయ్ ట్రామ్కి సంబంధించి కూడా ప్రత్యేక సమయాల్ని ప్రకటించారు. ఇదిలా వుంటే, కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్స్ ఆగస్ట్ 13 నుంచి మూసివేయబడ్తాయని అధికారులు తెలిపారు. ఉమ్ అల్ రమూల్ మరియు ఆర్టిఎ హెడ్ ఆఫీస్ వద్దనున్న స్మార్ట్ కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్స్ మాత్రం పనిచేస్తాయి. బస్లకూ, మెరైన్ ట్రాన్స్పోర్ట్కీ ప్రత్యేకంగా వేళల్ని ప్రకటించారు అధికారులు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు