9 నెలల చిన్నారిని చిదిమేసిన రాక్షసుడికి మరణ శిక్ష
- August 08, 2019
అభం శుభం తెలియని పసి మొగ్గని నెలల ప్రాయంలోనే తుంచేసిన కిరాతకుడికి.. మరణశాసనం రాసింది న్యాయస్థానం.. తొమ్మిది నెలల చిన్నారిని చిదిమేసిన నరరూప రాక్షసుడికి అందరూ కోరుకున్న శిక్ష పడింది.
కళ్లు తెరిచి లోకాన్ని కూడా చూడలేని వయసు.. బాధ, సంతోషం ఏమీ తెలియని ప్రాయం.. అమ్మా అని ఏడవలేని వయసు.. ఏం పాపం చేసింది ఆ చిన్నారి.. కన్ను మిన్ను కానక కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడు ప్రవీణ్.. పసి మొగ్గపై పాశవికంగా అత్యాచారం చేశాడు. అక్కడితో సంతృప్తి చెందని రాక్షసుడు చిన్నారిని హత్య చేసి.. ఓ అమ్మకు గర్భశోకాన్ని మిగిల్చాడు. మనుషులపై నమ్మకం లేకుండా చేశాడు.
వరంగల్ జిల్లా హన్మకొండ రెడ్డి కాలనీలో జరిగిన ఈ పైశాచిక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. 48 రోజుల కిందట ఇంటి డాబా మీద తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారిని ప్రవీణ్ ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ కేసులో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కె.జయకుమార్ సంచలన తీర్పును వెలువరించారు. ప్రవీణ్‌కు మరణ శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు. మానవత్వాన్ని ప్రశ్నించిన ఈ ఘటనపై ఇంత త్వరగా తీర్పును ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఒక కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి ఇంత త్వరగా తీర్పు ఇవ్వడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు