ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ
- August 08, 2019
ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు 2019, ఆగస్టు 08వ తేదీ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా లేఖను గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఐదేళ్ల పాటు వాసిరెడ్డి పద్మ పదవిలో కొనసాగనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నన్నపనేని రాజకుమారికి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవిని కట్టబెట్టారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే నన్నపనేని తన పదవికి రాజీనామా చేశారు.
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి సీఎం జగన్ పదవులు కట్టబెడుతున్నారు. మంత్రి వర్గంలో స్థానం దక్కని వారికి ఆయా పదవులను కేటాయిస్తున్నారు సీఎం జగన్. వైసీపీ అధికార ప్రతినిధిగా వాసిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడారు. సామాజిక వర్గ కోణంలో భాగంగా పదవిని ఆమెకు కట్టబెట్టారని సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు