పాకిస్తాన్ మరో సంచలన నిర్ణయం
- August 08, 2019
కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను భారత ప్రభుత్వం రద్దు చేయడంపై పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇప్పటికే భారత్ తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన పాక్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్, పాక్ ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును వాగా బార్డర్ వద్దే నిలిపేసింది. కాగా సంఝౌతా ఎక్స్ ప్రెస్ 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. వీక్లీ ఢిల్లీ నుంచి లాహోర్ కి, లాహోర్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుంది. ఇరుదేశాల ప్రయాణికులు ఇందులో ప్రయాణం సాగిస్తున్నారు. అయితే పాక్ తాజా నిర్ణయంతో భారత్ కు పెద్దగా ఒరిగేది లేదని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







