సుష్మా స్వరాజ్‌కి బహ్రెయిన్‌లో ఘన నివాళి

- August 08, 2019 , by Maagulf
సుష్మా స్వరాజ్‌కి బహ్రెయిన్‌లో ఘన నివాళి

బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌లో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సంతాప సమావేశాల్లో దివంగత నేత సుష్మా స్వరాజ్‌కి ఘన నివాళులు అర్పించారు. గుండె పోటుతో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ మృతి చెందిన విషయం విదితమే. ఇండియన్‌ అంబాసిడర్‌ అలోక్‌కుమార్‌ సిన్హా, సుష్మా స్వరాజ్‌ సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు. బహ్రెయిన్‌ - భారత్‌ మధ్య సంబంధాల మెరుగు కోసం ఆమె ఎంతో కృషి చేశారని చెప్పారు. సీఫ్‌లోని ఇండియన్‌ ఎంబసీ కాంప్లెక్స్‌లో ఈ సంతాప సభ జరిగింది. వేదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బహ్రెయిన్‌లో పలుమార్లు ఆమె పర్యటించారనీ, చివరిసారిగా 2018లో ఆమె బహ్రెయిన్‌లో పర్యటించి న్యూ ఎంబసీ కాంప్లెక్స్‌ని ప్రారంభించారని చెప్పారు. బహ్రెయిన్‌లోని భారత పౌరులంతా సుష్మా స్వరాజ్‌ సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని సిన్హా వివరించారు. ఇండియన్‌ క్లబ్‌ అలాగే బహ్రెయిన్‌ కేరళీయ సమాజంలో కూడా సుష్మా స్వరాజ్‌ మృతి నేపథ్యంలో సంతాప సమావేశాలు జరిగాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com