హజ్‌ కోసం సౌదీ చేరుకున్న 1.8 మిలియన్ మంది ఫిలిగ్రిమ్స్‌

- August 08, 2019 , by Maagulf
హజ్‌ కోసం సౌదీ చేరుకున్న 1.8 మిలియన్ మంది ఫిలిగ్రిమ్స్‌

జెడ్డా: 1.8 మిలియన్ల మందికి పైగా హజ్‌ ఫిలిగ్రిమ్స్‌ సౌదీ అరేబియా చేరుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ హజ్‌ ఎరైవల్స్‌ సోమవారంతో ముగిశాయి. కాగా, బుధవారం ఉదయం చివరి బ్యాచ్‌ ఫిలిగ్రిమ్స్‌ ట్యునీషియా నుంచి మక్కా రూట్‌ ద్వారా సౌదీకి చేరుకున్నారు. మక్కా రూట్‌ ఇనీషియేటివ్‌ ద్వారా వచ్చే ప్రయాణీకులు హెల్త్‌, వీసా మరియు ఇమ్మిగ్రేషన్‌ ప్రాసెస్‌ని తమ తమ దేశాల్లో పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. తద్వారా మక్కా మరియు మదీనాలోకి సీమ్‌లెస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అవడానికి వీలు కలుగుతుంది. 171,000 మంది యాత్రీకులు ట్యునీషియా, మలేసియా, ఇండోనేసియా, పాకిస్తాన్‌ మరియు బంగ్లాదేశ్‌ నుంచి ఈ ఇనీషియేటివ్‌ ద్వారా లబ్ది పొందారు. కాగా, మొత్తం 1,725,455 మంది ప్రయాణీకులు సౌదీ అరేబియాకి వచ్చారనీ, వీరిలో 95,634 మంది వాయు మార్గంలో, 17,250 మంది జల మార్గంలో వచ్చారు. ఈ ఏడాది 2.5 మిలియన్ల మందికి పైగా హజ్‌ ఫిలిగ్రిమ్స్‌ పవిత్ర ప్రార్థనల్ని నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com