సుష్మా స్వరాజ్‌కి బహ్రెయిన్‌లో ఘన నివాళి
- August 08, 2019
బహ్రెయిన్ కింగ్డమ్లో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సంతాప సమావేశాల్లో దివంగత నేత సుష్మా స్వరాజ్‌కి ఘన నివాళులు అర్పించారు. గుండె పోటుతో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మృతి చెందిన విషయం విదితమే. ఇండియన్ అంబాసిడర్ అలోక్‌కుమార్ సిన్హా, సుష్మా స్వరాజ్ సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు. బహ్రెయిన్ - భారత్ మధ్య సంబంధాల మెరుగు కోసం ఆమె ఎంతో కృషి చేశారని చెప్పారు. సీఫ్‌లోని ఇండియన్ ఎంబసీ కాంప్లెక్స్‌లో ఈ సంతాప సభ జరిగింది. వేదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బహ్రెయిన్‌లో పలుమార్లు ఆమె పర్యటించారనీ, చివరిసారిగా 2018లో ఆమె బహ్రెయిన్‌లో పర్యటించి న్యూ ఎంబసీ కాంప్లెక్స్‌ని ప్రారంభించారని చెప్పారు. బహ్రెయిన్‌లోని భారత పౌరులంతా సుష్మా స్వరాజ్ సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని సిన్హా వివరించారు. ఇండియన్ క్లబ్ అలాగే బహ్రెయిన్ కేరళీయ సమాజంలో కూడా సుష్మా స్వరాజ్ మృతి నేపథ్యంలో సంతాప సమావేశాలు జరిగాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!