భారత దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు
- August 10, 2019
భారత దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ .. ఇక్కడ అని లేకుండా ప్రతి రాష్టాన్ని వర్షాలు ముంచెత్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో వరుణుడు భీభత్సం సృష్టిస్తున్నాడు. కర్ణాటక,కేరళ, తెలంగాణ, ఏపీ రాష్ఱ్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి,కృష్ణ ,కావేరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్నా భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. భారీ వరదల కారణంగా 25 మంది మృతి . వర్షం కారణంగా కొచ్చి విమానశ్రయాన్ని కూడా ముసివేశారు. అలాగే కర్నాటకలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ఱ్రాలోని అన్ని జలశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. డ్యామ్‌లు పూర్తి స్థాయిలో నింది ప్రమాదరస్థాయికి చేరుకున్నాయి. అక్కడి వరద బీభత్సానికి అద్దం పట్టేలా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు కాలువలో కొట్టుకుపోతున్న దృశ్యాలు ఆ ర్రాష్ట్రంపై వరుణుడు ఎంతటి ప్రతాపాన్ని చూపిస్తున్నాడో తెలియజేస్తుంది. కొడగు జిల్లా కొరంగల్లో మట్టిరోడ్డుపై ఉన్న చిన్నపాటి వంతెన కింద నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ సమయంలో ఆ వంతెనపై నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెళ్లేందుకు ప్రయత్నించారు. సరిగ్గా ఆ వారు వంతెన దాటుతున్న సమయంలోనే మట్టిరోడ్డుతో ఉన్న వంతెన తెగింది. దీంతో బైక్‌తో సహా ఆ ఇద్దరూ వరద నీటిలో కొట్టుకుపోయారు. అయితే వాళ్ళు ఏమయ్యారు అనే విషయం ఇప్పటివరకు తెలియలేదు. బయటకు వచ్చారా? లేదా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!