ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులకు అండగా నిలిచిన తెలంగాణా జాగృతి-కువైట్
- August 10, 2019
కువైట్:ఏజెంట్ల మోసాలకు కువైట్( గల్ఫ్)లో ఆగమైన 10 మంది నిజామాబాద్,జగిత్యాల,నిర్మల్ మరియు అదిలాబాద్ జిల్లాలకు చెందిన వలస బిడ్డల నిత్యావసర వస్తువులు సరఫరా చేసి అండగా నిలిచిన తెలంగాణా జాగృతి కువైట్.
ఏజెంట్ చేతిలో మోసపోయి గల్ఫ్ కువైట్ లో తినడానికి తిండి లేక ఉండడానికి నీడ లేక అష్ట కష్టలు పడుతున్న నిజామాబాద్ , నిర్మల్ మరియు అదిలాబాద్ జిల్లాలకు చెందిన 10 మంది పరిస్థితిని జాగృతి కువైట్ ప్రెసిడెంట్ వినయ్ ముత్యాల కి దృష్టికి తీసుకపోగా వెంటనే స్పందించి జాగృతి సభ్యులతో బాధితుల దగ్గరకు చేరుకొని వారి బాధలను గాధలను ప్రత్యక్షంగా చూసి ముందుగా ఆకలితో ఉన్న బాధితులకు తినేందుకు ఆహారాన్ని సమకూర్చి ఆ తర్వాత వివరాలు మొత్తం తీసుకొని వారికి నిత్యావసర సరుకులు వంట సామగ్రిని జాగృతి వెల్ఫేర్ కిట్ ని అందించడం జరిగింది.
మంచి వీసా, జీతాలు బాగస్తాయని కార్మికులను మోసం చేసి లక్షల్లో దోచుకొని గల్ఫ్ సప్లై కంపెనీల్లో పంపించి ఏజెంట్లు చేతులు దులుపుకున్నారు.చెయ్యనీకి పని లేదు, మండుటెండలో ఏసీ లేదు, ఇక్కడ ముడునెల్ల సంది ఉండలేక అటు ఇంటికి పోతే అప్పులోల భయం. కొందరికి వీసా గడువు ముగిసింది, కొందరికి కువైట్ రెసిడెన్సి చెయ్యమంటే ఇంకా పైసలు అడుగవట్రి..ఖర్చులకు రూపాయి లేక ఇంటికి ఫోన్ చేయ్యాలేక సతమతమౌతున్రు. ముందే అప్పుమీద అప్పుచేసి ఇక్కడికచ్చి మల్ల బతుకు ఆగంఐయ్యిందని బాధపడుతున్న సమయం. కార్మికులందరు మానసికంగా కుంగిపోయి దిక్కుతోచక ఎలాగైనా సహాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు.
తెలంగాణా జాగృతి కువైట్ శాఖ జనరల్ సెక్రటరీ మార్క ప్రమోద్ కుమార్ మరియు జాయింట్ సెక్రెటరీ వారం రాజశేఖర్ , మామిడిపల్లి రాజన్నా, రమేష్ చెలివేరి, విస్డం ఆచారి గన్నారాపు మరియు నస్పూరి గోపాల్ ,ఎంతో ధైర్యాన్ని చెబుతూ తమ సహాయాన్ని అందిస్తూ స్వదేశానికి వెళ్లే వరకు ఎంతో తోడ్పాటు అందించారు. బాదితులను కలిసి వివరాలు తీసుకోని అక్కడి చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు.


తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







