తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ప్రొ.జయశంకర్ సార్ జయంతి వేడుకలు
- August 10, 2019
ఖతార్:తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహ ఖతార్ లో ప్రొ.జయశంకర్ సార్ జయంతి వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు సందర్భంగా జాగృతి కార్యవర్గ సభ్యులు హాజరై ప్రో. జయశంకర్ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్నా గారు మాట్లాడుతూ..
సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చని సార్ జీవితం మనకు తెలియజేస్తుందని అన్నారు. వారి మాటలను ముందుతరాలకు తెలియజేస్తూ వారికి మార్గం చూపే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.ఉపాధ్యక్షుడు శశాంక్ అల్లకొండ గారు మాట్లాడుతూ పుట్టుక నీది చావు నీది నడుమ జీవితమంతా తెలంగాణది ఈ నినాదాన్ని నమ్మి ఆచరించిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు.తెలంగాణ జాగృతి నాయకులు శేఖర్ చిలువేరి , ఎల్లయ్య తాళ్లపెళ్లి, నవీన్ అళ్లే ,మహేందర్ మరియు రమేశ్ పిట్ల తదితర నాయకులు హాజరై జయశంకర్ సార్‌ను స్మరించుకుంటూ వారు లేని లోటును పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
----రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి-ఖతార్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







