తెలంగాణలో 6 విమానాశ్రయాలకు ఏర్పాట్లు
- August 14, 2019
తెలంగాణ రాష్ట్రంలో 6 విమానాశ్రయాలు ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పథకం ఉడాన్ కింద వీటిని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పెద్దపల్లి, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెంలో విమానాశ్రయాలు నిర్మించాలని అంగీకరించింది. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే ఎయిర్ స్ట్రిప్లున్న సంగతి తెలిసిందే. వరంగల్ ఎయిర్ స్ట్రిప్‌ను సైనిక అవసరాలకు నిర్మించారు.
ప్రతిపాదించిన 6 ప్రాంతాల్లో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా (AAI) కన్సల్టెన్సీగా నియమించింది. అధికారులు పర్యటించి ఎయిర్ పోర్టులు నిర్మాణ అవసరాలపై స్టడీ చేయనున్నారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వానికి నివేదిక అందచేయనున్నారు. నివేదిక ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ విధానాన్ని రూపొందిస్తాయి. ఇప్పటికే వరంగల్, కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రతిపాదించిన ప్లేస్‌లను పరిశీలించింది.
రెండో దశలో ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అధికారుల బృందం పర్యటించనుంది. ఆయా ప్రాంతాల్లో గడిచిన 5-6 దశాబ్దాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి.., ట్రాఫిక్ డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుంది.., విమానాశ్రయాల అవసరం ఉందా.., ఎంత స్థలం అవసరం తదితర వాటిపై అధికారులు పరిశీలన చేయనున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు







