విజయవంతంగా మూడోసారి బాండ్ల ద్వారా రూ. 100 కోట్లు సేకరించిన బల్దియా
- August 20, 2019
మూడవ విడతలో వంద కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో సేకరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి రికార్డు సృష్టించింది. దేశంలోనే బాండ్ల ద్వారా నిధులను సేకరించిన మున్సిపల్ కార్పొరేషన్ గా జిహెచ్ఎంసి తొలి మున్సిపల్ కార్పొరేషన్ కాగా వరుసగా మూడోసారి రూ. 100 కోట్ల సేకరణకు ముంబాయి స్టాక్ ఎక్స్ చేంజ్ లో బిడ్డింగ్ కు వెళ్లి నియమిత సమయం కన్నా ముందుగానే విజయవంతంగా వంద కోట్లు సేకరించింది. తద్వారా వరుసగా మూడు సార్లు విజయవంతంగా బాండ్ల ద్వారా నిధులను సేకరించి ఏకైక కార్పొరేషన్ గా జిహెచ్ఎంసి నిలిచింది. అయితే నేడు రూ. 300 కోట్లకు బిడ్డింగ్ నిర్వహించాలని జిహెచ్ఎంసి నిర్ణయించినప్పటికీ స్టాక్ మార్కెట్ లో ఏర్పడ్డ ఒడిదుడుకుల నేపథ్యంలో కేవలం వంద కోట్ల రూపాయల సేకరణకు మాత్రమే వెళ్లాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. మంగళవారం నాడు ఉదయం 11:30 గంటల నుండి 12:30 వరకు బిడ్డింగ్ లో పాల్గొనడానికి ముంబాయి స్టాక్ ఎక్స్ చేంజ్ బిడ్డర్లకు అవకాశం కల్పించింది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసి కమిషనర్ ఎం.దానకిషోర్, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ సలహాదారు జయశ్రీ, జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్లు సిక్తాపట్నాయక్, కెనడి, ఎస్.బి.ఐ కార్ఫ్స్, బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ ప్రతినిధులు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం ద్వారా బిడ్డింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. బిడ్డింగ్ ప్రారంభమైన ఉదయం 11:30గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటలలోపు మరో 15 నిమిషాల సమయం ఉండగానే దాదాపు ఐదు సంస్థలు కలిపి మొత్తం రూ. 100 కోట్లకు బిడ్ లను దాఖలు చేశారు. బ్యాంకులు అందజేసే రుణాల వడ్డీ కన్నా తక్కువగా కేవలం 8.93శాతం వార్షిక వడ్డీతో ఈ వంద కోట్ల రూపాయలను జిహెచ్ఎంసి నేడు సేకరించగలిగింది. ఇప్పటికే గత రెండు విడతలుగా రూ. 395 కోట్లు బాండ్ల ద్వారా సేకరించింది. గ్రేటర్ హైదరాబాద్ లో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, వంతెనల నిర్మాణానికి బాండ్ల ద్వారా సేకరించిన నిధులను వినియోగించుకోనున్నట్టు నగర మేయర్ రామ్మోహన్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







