బాలయ్య 'లయన్' పైరసీ సీడీలు పట్టివేత
- May 15, 2015
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'లయన్' చిత్రం అలా విడుదలవ్వడం ఆలస్యం...ఇలా పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా ఒంగోలులోని సీడీ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో లయన్ సినిమా పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సీడీ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.లయన్ పైరసీ వెనక..సౌతిండియా పైరసీ మాఫియా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఈ పైరసీ సీడీలు ఇప్పటికే పంపిణీ అయినట్లు సమాచారం. అదే నిజమైతే పైరసీ కారణంగా నిర్మాతలు నష్టపోవడం ఖాయం. సినిమా విషయానికొస్తే..'లయన్' చిత్రం ఓపెనింగ్స్ భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 5.5 కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం.ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయం అయ్యారు.రుద్రపాటి రామరావు నిర్మాత.బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్ ప్రసాద్, కూర్పు: గౌతంరాజు
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









