హౌతీ డ్రోన్స్‌ని కూల్చేసిన అరబ్‌ సంకీర్ణ దళాలు

హౌతీ డ్రోన్స్‌ని కూల్చేసిన అరబ్‌ సంకీర్ణ దళాలు

రియాద్‌: అరబ్‌ సంకీర్ణ దళాలు హౌతీ తీవ్రవాదులు సంధించిన డ్రోన్స్‌ని కూల్చివేయడం జరిగింది. సౌత్‌ సిటీస్‌ అయిన ఖామిస్‌ ముషాయత్‌ మరియు జజాన్‌ వైపుగా ఈ మిస్సైల్స్‌ని సౌదీ తీవ్రవాదులు సంధించారని సంకీర్ణ దళాల అధికార ప్రతినిథి కల్నల్‌ టుర్కి అల్‌ మాలికి చెప్పారు. ఖామిస్‌ ముషాయత్‌ వైపు సంధించిన రెండు డ్రోన్లను గురువారం కూల్చివేయడం జరిగింది. కాగా, శనివారం మరో డ్రోన్‌ని సంధించగా, దాన్ని సైతం కూల్చివేయగలిగారు. ఇటీవలి కాలంలో డ్రోన్లతో దాడులు ఎక్కువైనట్లు కల్నల్‌ టుర్కి అల్‌ మాలికి పేర్కొన్నారు.  

Back to Top