ఇండియాకి ఆఫర్‌ టిక్కెట్స్‌ ప్రకటించిన యూఏఈ ఎయిర్‌లైన్స్‌

ఇండియాకి ఆఫర్‌ టిక్కెట్స్‌ ప్రకటించిన యూఏఈ ఎయిర్‌లైన్స్‌

ఈద్‌ అల్‌ అదా సెలవుల్లో సొంత ప్రాంతాలకు వెళ్ళలేకపోయినవారికి మరో అవకాశం కల్పిస్తోంది యూఏఈకి చెందిన ఎయిర్‌ లైన్స్‌. షార్జా కేంద్రంగా పనిచేస్తోన్న ఎయిర్‌ అరేబియా, వన్‌ వే డిస్కౌంట్‌ ఫేర్స్‌ని మొత్తం 16 సిటీస్‌కి వెళ్ళాలనుకునేవారి కోసం ప్రకటించింది. వీటిల్లో ఇండియా, పాకిస్తాన్‌కి చెందిన పలు నగరాలున్నాయి. నేటితో ప్రారంభమయ్యే ఈ ఆఫర్స్‌ డిసెంబర్‌ 9 వరకు కొనసాగుతాయి. ముంబైకి వెళ్ళాలనుకునేవారు 330 దిర్హామ్‌ల నుంచి ప్రారంభమయ్యే టిక్కెట్లను కొనుగోలు చేయొచ్చు. ఢిల్లీకి 385 దిర్హామ్‌లకే ప్రయాణం చేసే వీలుంది. అహ్మదాబాద్‌, నాగపూర్‌, గోవా, కొలంబో, బీరుట్‌, ఇస్తాంబుల్‌, కాట్మండు, అలెగ్జాండ్రియా, కాబూల్‌, కౌలాలంపూర్‌, అమ్మాన్‌, ట్యునిస్‌, క్వెట్టా తదితర నగరాలకు ఆఫర్‌ టిక్కెట్‌ ధరలు వర్తిస్తాయి. 

Back to Top