యూఏఈలో రుపే కార్డుని ఆవిష్కరించి ఉపయోగించిన ప్రధాని నరేంద్ర మోడీ

యూఏఈలో రుపే కార్డుని ఆవిష్కరించి ఉపయోగించిన ప్రధాని నరేంద్ర మోడీ

అబుధాబి:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూఏఈలో రుపే కార్డుని ఆవిష్కరించారు. అబుధాబిలోని ఎమిరేట్‌స ప్యాలెస్‌లో రుపే కార్డు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గల్ఫ్‌లో యూఏఈ ఈ ఘనతను సాధించిన తొలి దేశంగా రికార్డులకెక్కింది. యూఏఈలోని 21 బిజినెస్‌ గ్రూప్స్‌ రుపే కార్డుని అనుమతించనున్నాయి. ఇండియన్‌ స్వీట్స్‌ని కొనుగోలు చేసేందుకు నరేంద్ర మోడీ తన రుపే కార్డుని తొలిసారిగా యూఏఈలో వినియోగించి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదిలా వుంటే, యూఏఈకి ప్రతి యేటా 3 మిలియన్‌ ఇండియన్‌ టూరిస్టులు వస్తుంటారు. రుపే కార్డు అమల్లోకి రావడంతో వారందరికీ మేలు కలుగుతుందని భావిస్తున్నారు. మాస్టర్‌, వీసా కార్డుల్లానే రుపే కార్డు అతి పెద్ద పేమెంట్‌ గేట్‌ వేగా సేవలు అందిస్తోంది. స్వదేశీ కార్డుగా రుపేకి ఇండియాలో విపరీతమైన క్రేజ్‌ వున్న విషయం తెల్సిందే.  

 

Back to Top