23 శాతం పెరిగిన వలసదారుల రెమిటీస్‌

23 శాతం పెరిగిన వలసదారుల రెమిటీస్‌

కువైట్‌: బ్యాంక్‌ డేటా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్‌లో 23 శాతం పెరుగుదల రెమిటీస్‌లో నమోదయ్యిందని తెలుస్తోంది. 2019 తొలి అర్థ భాగంలో 8.6 బిలియన్‌ డాలర్ల రెమిటీస్‌ నమోదయ్యాయి. 2018 తొలి అర్థ భాగంలో ఇది 7 బిలియన్‌ డాలర్లుగా వుంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కువైట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం తొలి క్వార్టర్‌తో పోల్చితే రెండో క్వార్టర్‌లో 15 శాతం అదనంగా నమోదయ్యిందని అర్థమవుతోంది. కువైట్‌లో 3.4 మిలియన్‌ వలసదారులు వర్క్‌ ఫోర్స్‌గా వున్నారు. కువైట్‌ జనాభాలో ఇది 70.5 శాతం. ఆసియా కమ్యూనిటీ ఇందులో సింహభాగం వుంది. 

--షేక్ బాషా(కువైట్)

Back to Top