'జన గణ మణ'లో యాక్షన్ కింగ్
- August 25, 2019
యాక్షన్ కింగ్ 'అర్జున్' 50 సంవత్సరాల వయసులో కూడా ఫిట్నెస్ ను మెంటైన్ చేస్తూ యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తున్నాడు. అందులో భాగంగా గత ఏడాది విశాల్ నటించిన 'ఇరుంబు తేరై' సినిమాలో అర్జున్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు . ఈ సినిమా తెలుగులో 'అభిమన్యుడు' గా విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత అర్జున్ ' బిచ్చగాడు'ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరో గా నూతన దర్శకుడు తెరకెక్కిన్చే'కోలైకారన్' అనే సినిమాలో నటించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. తెలుగులో ఈ సినిమా కిల్లర్ పేరుతో విడుదలై పర్వాలేదనిపించింది.
ఇక ఇప్పుడు అర్జున్ మరో సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం. 'ఎండ్రెండుమ్ పున్నగై , మనితన్' చిత్రాల దర్శకుడు అహ్మద్ డైరెక్షన్ లో జయం రవి హీరోగా 'జన గణ మణ' అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో తన పాత్ర నచ్చి సినిమా కు వెంటనే సినిమా చేయడానికి ఒప్పకున్నాడట అర్జున్. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటించనుంది. వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈచిత్రం గురించి త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఇక అర్జున్ తెలుగులో చివరగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో కీలక పాత్ర లో నటించాడు. అయితే గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈచిత్రం పరాజయాన్ని చవి చూసింది. ఇక ఈ సినిమా తరువాత అర్జున్ తెలుగులో మరో సినిమాకు సైన్ చేయలేదు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







