షార్జా నుంచి శంషాబాద్‌ వస్తున్న ప్రయాణికుని వద్ద భారీగా బంగారం స్వాధీనం!

షార్జా నుంచి శంషాబాద్‌ వస్తున్న ప్రయాణికుని వద్ద భారీగా బంగారం స్వాధీనం!

శంషాబాద్‌:విదేశాల నుంచి నగరానికి భారీగాఎత్తున అక్రమంగా తరలివస్తున్న బంగారాన్ని చూస్తే కస్టమ్స్‌ అధికారులే కంగు తింటున్నారు. రక రకాల పద్దతుల్లో స్మగ్లర్లు బంగారాన్ని నగరానికి తరలిస్తున్నారు. తాజాగా షార్జా నుంచి నగరానికి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి 26 బంగారం బిస్కట్లను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. నిందితుడినుంచి స్వాధీనం చేసుకున్న బంగారం మొత్తం 3 కేజీలు ఉండగా దీని విలువ దాదాపు 1.11 కోట్లవరకుఉంటుందని అధికారులు అంచనా వేశారు. వివరాల్లోకి వెళ్తే షార్జా నుంచి హైదరాబాద్‌ వస్తున్న షేక్‌ అబ్దుల్‌ సాజిద్‌ అనే ప్రయాణికుడు అక్రమంగా బంగారం తరలిస్తున్నాడనే సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దీంతో షేక్‌ అబ్దుల్‌సాజిద్‌ తనిఖీలు జరుగుతున్నాయన్న విషయం గ్రహించాడు. తాను తరలిస్తున్న బంగారాన్ని మరుగుదొడ్డి పడేసి ఏమీ తెలియనట్టుగా విమానాశ్రయం నుంచి వెళ్లడానికి ప్రయత్నంచాడు.కస్టమ్స్‌ అధికారులు అతన్ని తనిఖీ చేసినా బంగారం దొరకలేదు. అయితే బంగారం స్మగ్లింగ్‌విషయంలో పక్కా సమాచారం ఉన్నకస్టమ్స్‌ అధికారులు అతన్నికస్టడీలోకి తీసుకుని  విచారణ విచారిస్తే బంగారాన్ని మరుగుదొడ్డిలో పారేసినట్టు వెల్లడించారు. దీంతో అధికారులు అక్కడి నుంచి 2.99 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మరింత సమాచారం కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Back to Top