చైనా - అమెరికా వాణిజ్యపోరుపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
- August 26, 2019వాషింగ్టన్: 'మాకింక చైనా అవసరం లేదు. నిజం చెప్పాలంటే వారి (చైనా) ప్రమేయం లేకుండానే మేం మెరుగైన ప్రగతి సాధించగలం చైనాకు ప్రత్యామ్నాయాన్ని అన్వేషించాలని మా దేశ కంపెనీలను ఆదేశించాం. ప్రత్యామ్నాయం లభించకపోతే వెనక్కి వచ్చి మన దేశం నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని సూచిస్తున్నాం...!' చైనాతో వాణిజ్య పోరు నానాటికీ ఉధృతమవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన తాజా వివాదాస్పద వ్యాఖ్యలివి. చైనాకు చెందిన హువై సంస్థతో కూడా తామెటువంటి వాణిజ్య కార్యకలా పాలూ కొనసాగించబోమని ఆయన మరో ట్వీట్లో స్పష్టం చేశారు. తమ దేశానికి చెందిన ఫెడెక్స్, అమెజాన్, యూపీఎస్, పోస్టాఫీస్ వంటి అన్ని సంస్థలనూ చైనా నుంచి వెనక్కి తిరిగి వచ్చేయాలని ఆదేశిస్తున్నా నని ట్రంప్ తన ట్వీట్లో వెల్లడించారు. గత రెండున్నరేండ్లుగా తమ ఆర్థిక వ్యవస్థ అద్భుత స్థాయిలో మెరుగుపడిందనీ, చైనా కన్నా మెరుగైన దశలో వుందని, ఇదే పరిస్థితిని తాము కొనసాగిస్తామని ఆయన తన ట్వీట్లో వివరించారు. చైనాతో ట్రంప్ కొనసాగిస్తున్న వాణిజ్య పోరు మరింత దిగజారే అవకాశాలున్న సూచనలు కన్పిస్తుండటంతో అమెరికా స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నాస్డాక్ (కంపోజిట్), డౌజోన్స్ ఇండిస్టియల్ (డీజేఐ) యావరేజ్, ఎస్అండ్పీ 500 సూచీలు శుక్రవారం కనిష్ట స్థాయిలో ట్రేడింగ్‌ను ముగించాయి.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ