ఐదు రోజులుగా పెరుగుతున్న పసిడి ధర..
- January 08, 2016
పసిడి ధర పైపైకి పోతోంది. వరసగా ఐదు రోజులుగా పెరుగుతూనే ఉంది. గురువారం రూ.26,000 మార్కును దాటిన బంగారం ధర ఈ రోజు మళ్లీ రూ.20 పెరిగింది. దీంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,350కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు స్థిరంగా ఉండటం తదితర కారణాల వల్ల దీని ధర పెరుగుతోందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,109.20 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఈ రోజు వెండి ధర సైతం పెరిగింది. రూ.100 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 34,100కు చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 14.31 అమెరికన్ డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







